Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎయిర్ ఇండియాను టాటాలకు అప్పజెప్పడమనేది సరైందికాదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాల్రాజ్, వి యస్ బోస్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్డీ యూసుఫ్ పేర్కొన్నారు. ఆ సంస్థను ప్రయివేట్పరం చేయడాన్ని ఒక దుర్ధినంగా పేర్కొంటూ గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ప్రజాస్వా మ్య వాదులకు, ప్రభుత్వరంగ ప్రేమికులకు ఈ చర్య తీవ్ర మనస్థాపాన్ని కల్గిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిందని తెలిపారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.