Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్శకుడు, నిర్మాతపై కఠిన చర్యలు తీసుకోవాలి
- కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కల్లు అమ్ముతున్న మహిళలను వేశ్యలుగా చిత్రీకరించిన 'నాలో నేను' చిత్రాన్ని నిషేధించాలని కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) డిమాండ్ చేసింది. ఆ సినిమా దర్శక, నిర్మాతలు పీఎన్రెడ్డి, మదన. జేపీ, తెలుగు ఫిల్మీనగర్, మ్యాంగో ఛానెల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈమేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాటూరి బాల్‌రాజ్‌గౌడ్, ఎంవీ రమణ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నిత్యం ప్రమాదాలకు గురవుతూ బతుకుదెరువు కోసం కల్లుగీత వత్తి చేస్తున్న వారిని ఆదరించాల్సిందిపోయి అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నాలో నేను సినిమాలో కల్లు అమ్ముతున్న మహిళను వేశ్యగా చూపిస్తూ సినిమా తీశారని తెలిపారు. సినిమాల మార్కెట్ కోసం ఆడవాళ్లను అసభ్యంగా చూపించడం ఆనవాయితీ కాదని సూచించారు. కల్లు గీత వత్తిని, మహిళలను అవమాన పరిచేలా ఉందంటూ గౌడ, కల్లు గీత కార్మిక సంఘాలు నిరసనలు తెలిపాయనీ, ఈవిషయంలో సంబంధిత బాధ్యులపై కేసులు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అబ్కారి శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ జోక్యం చేసుకుని తక్షణమే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.