Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో రేవంత్ రెడ్డి పిల్
- కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లో కోట్ల రూపాయల విలువైన భూములను వేలం కొన్న వారికి కాకుండా వేరే కంపెనీకీ, అదీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కంపెనీకి కట్టబట్టెడాన్ని సవాల్ చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి రాష్ట్రానికి ఆదేశాలిచ్చింది. ఇందుకోసం ఆరు వారాలు సమయం ఇస్తున్నట్టు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రారుదుర్గ్లో 31.35 ఎకరాల భూమిని డీఎల్ఎఫ్ అనే సంస్థ వేలంలో అధిక రేటుకు వశం చేసుకుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ తెలిపారు. భూమిని డీఎల్ఎఫ్ కంపెనీ కాకుండా ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. టీఎస్ఐఐసీ వేసిన వేలంలో రూ.580.5 కోట్లకు డీఎల్ఎఫ్ పొందితే ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే నిర్మాణ సంస్థ దిగ్గజం రామేశ్వర్‌రావుకు చెందిన కంపెనీకి ఇవ్వడం అన్యాయమని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని కూడా ఆ సంస్థ కోసమే ఇచ్చిందనీ, రూ.36 కోట్ల మేరకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వం కౌంటర్ వేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.