Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హౌంశాఖ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గత నెల 27 నుంచి నెల రోజుల పాటు కంటైన్మెంట్ జోన్లు అమలు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హౌంశాఖ మరోసారి పొడిగించింది. ఈ మేరకు గురువారం ఆ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. జిల్లాలవారీగా, ఆయా ప్రాంతాల వారీగా కరోనా కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటూ ఈ కంటైన్మెంట్లను కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.