Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్లీలో అత్యల్పంగా 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
- 22 జిల్లాలకు టీఎస్డీపీఎస్ ఆరెంజ్ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో తూర్పు, ఈశాన్య దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు చలితో అల్లాడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వర్లీలో అత్యల్పంగా 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత కొమ్రం భీమ్ జిల్లా సిర్పూర్(యు)లో 6.1 డిగ్రీలు, పిప్పల్దరిలో 7.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వచ్చే రెండు, మూడు రోజులు ఇదే తరహాలో రాష్ట్రంలోని 22 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు పడిపోయే అవకాశముందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(టీఎస్డీపీఎస్) వెదర్ బులిటెన్లో పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, జగిత్యాల, సిద్దిపేట, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లోనూ పది డిగ్రీల కంటే తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటితో పాటు హన్మకొండ, వరంగల్, జనగాం, మెదక్, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలకు కూడా వచ్చే రెండు రోజులకు గానూ టీఎస్డీపీఎస్ ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.