Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధార్ కార్డు.. సంతకం ఫోర్జరీ
- నలుగురి అరెస్ట్.. పరారీలో ఒకరు
- సీఐ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడి
నవ తెలంగాణ - పటాన్ చెరు
నకిలీ ఆధార్ కార్డు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసులు ఆ నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. సీఐ వేణుగోపాల్ రెడ్డి. క్రైమ్ సీఐ శ్రీనివాస్ మీడియా వివరాలు వెల్లడించారు. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ శివారులో గల వికాస్ సొసైటీ వెంచర్‌లోని సర్వే నెంబర్ 133/108లో దాసరి రాజారత్నం ప్లాట్ నెంబర్ 689( 500 గజాలు)ను 1986లో కొనుగోలు చేశాడు. కాగా అమీర్‌పేటకు చెందిన మురళీకృష్ణ, లక్ష్మయ్య, కూకట్‌పల్లికి చెందిన బాలకృష్ణ, అనిరుధ్ రెడ్డి, బంజారాహిల్స్‌కు చెందిన సుధీర్ కుమార్ కలిసి రాజరత్నం సంతకం ఫోర్జరీ చేశారు. అలాగే నకిలీ ఆధార్ కార్డు సృష్టించి కొన్ని రోజుల కిందట అతని ప్లాట్‌ను వేరే వ్యక్తికి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన రాజారత్నం పోలీసులను ఆశ్రయించడంతో ఐదుగురిలో నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4.50లక్షలు, నాలుగు మొబైల్ ఫ్లోన్లను స్వాధీనం చేసుకొని.. వారిని రిమాండ్‌కు తరలించారు. ఇందులో ఏ వన్‌గా ఉన్న మురళీకృష్ణ పరారీలో ఉన్నాడు. ఈ సమావేశంలో ఎస్ఐ రామ్ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.