Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పందించిన నర్సాపూర్ సివిల్ జడ్జి అనిత
- మంజూరు చేయిస్తానని హామీ
నవ తెలంగాణ-నర్సాపూర్
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు సాదుల శివమ్మ 'ఆసరా' పింఛన్ కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయం నర్సాపూర్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి అనిత దృష్టికి రాగా ఆమె వెంటనే స్పందించారు. శుక్రవారం వృద్ధురాలుంటున్న గ్రామానికి వెళ్ళి ఆమెతో మాట్లాడారు. వెంటనే పింఛన్ మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీడీవో నవీన్ కుమార్కు వృద్ధురాలి పెన్షన్ మంజూరుపై కలెక్టర్కు రిపోర్టు పంపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులు, పింఛన్లు, ఆధార్ కార్డు తదితర సమస్యలపై గ్రామస్తులు న్యాయమూర్తి అనిత దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆమె ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు తెలిపారు.