Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నేరేడుచర్ల
భూముల రిజిస్ట్రేషన్ ఫీజు పెంచడం సరికాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిలవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని అరిబండి భవన్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు ప్రజల ఆదాయం తగ్గుతుంటే.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం తగదన్నారు. ఇప్పటికే కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ ఫీజులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలపై అధికభారాలు మోపుతున్నారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు హద్దులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు బతకడం కష్టంగా ఉన్న సమయంలో అన్ని రంగాల మీద పన్నులు వేయడం సరికాదన్నారు. జీఓ 317ను వెంటనే సవరించాలని కోరారు. అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, దళితబంధును నిష్పక్షపాతంగా అమలు చేయాలని కోరారు. ప్రస్తుత సీజన్లో మిర్చి రైతులు పంట నష్టపోతున్నారని, పంట తెగుళ్లు, అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇలాంటి తరుణంలో రైతులను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ చట్టాన్ని మున్సిపాలిటీల్లో కూడా వర్తింపజేయాలని కోరారు. కరోనా మూడో దశ నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకొని మొబైల్ టీమ్ ద్వారా చికిత్స అందించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ పారేపల్లి శేఖర్‌రావు, పార్టీ పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్ పాల్గొన్నారు.