Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తయారీ, సరఫరాదారులకు సింగరేణి అధికారుల ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బొగ్గు ఉత్పత్తిలో ఈ ఏడాదిలో నిర్దేశించుకున్న 68 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా రోజుకు 14.8 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రతి రోజు 610 టన్నులకు తగ్గకుండా పేలుడు పదార్థాలు (ఎక్స్ ప్లోజివ్స్) సరఫరా చేయాలని సింగరేణి కాలరీస్ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్.బలరామ్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, ఫైనాన్స్, పర్సనల్) ఉత్పత్తి, సరఫరాదారులను కోరారు. ఈ అంశంపై శుక్రవారం వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంస్థ టార్గెట్లు సాధించేందుకు వచ్చే రెండు నెలలు కీలకమని చెప్పారు. ఈ నెల 12 నుంచి 27వ తేదీ వరకు రోజుకు సగటున కేవలం 457 టన్నుల ఎక్స్‌ప్లోజివ్స్ మాత్రమే సరఫరా జరిగిందనీ, దీని వల్ల ఓవర్ బర్డెన్ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇండెంట్ ప్రకారం 75 శాతమే సరఫరా జరుగుతున్నదనీ, దీన్ని 100 శాతానికి పెంచాలన్నారు.