Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రానికి నిర్దేశించిన లక్ష్యం కన్నా అధికంగా ధాన్యాన్ని సేకరించామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ ఆలోచనతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 6,872 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.13,690 కోట్ల విలువైన ధాన్యాన్ని 12.78 లక్షల మంది రైతుల నుంచి సేకరించినట్టు వెల్లడించారు.