Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన ఎన్‌బీవీ గ్రూపు
హైదరాబాద్ : ఫెర్రో అల్లార్సు, పవర్ జనరేషన్, కోల్‌మైనింగ్, హెల్త్కేర్లతో కూడిన నవ భారత్ వెంచర్స్ (ఎన్‌బీవీ) లిమిటెడ్ ఫలితాలు విడుదలయ్యాయి. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గతేడాది డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసిక, తొమ్మిది నెలలకు సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఎబీవీ గ్రూపు విడుదల చేసింది.మూడో త్రైమాసికంలో స్టెల్లార్ స్లాండలోన్ రెవెన్యూ లో 99శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈబీఐటీడీ ఏ 238శాతం, పీఏటీ 222 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇక స్టాండలోన్ తొమ్మిది నెలల ప్రదర్శన రెవెన్యూలో 85శాతం వృద్ధిని, ఈబీఐడీటీఏ 157శాతం, పీఏటీ 174శాతం పెరుగుదలను చూపించాయి.ఫెర్రో అల్లా ర్సు రెవెన్యూ 81శాతం పెరుగుదలను, పవర్ డివిజన్ 83 శాతం వృద్ధిని నమోదు చేశాయి.2022 ఆర్థిక సంవత్సర త్రైమాసికంలో చక్కటి పనితీరుతో నవభారత్ మంచి ఫలితాలను సాధించిందని సీఈఓ అశ్విన్ దేవినేని అన్నారు. సంస్థ ఆపరేషన్స్‌ను బలోపేతం చేయడంలో నవ భారత్ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నదని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో జాంబియన్ పవర్ ఆపరేషన్స్ మర్చె ంట్ కోల్ సేల్స్‌లో వృద్ధితో స్థిరంగా ఉన్నాయని అన్నారు.