Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్
నవతెలంగాణ - హైదరాబాద్
ఉస్మానియా ఆస్పత్రిలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద చికిత్సలు అందిస్తున్నట్టు ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ హిప్, జాయింట్ల మార్పిడి సర్జరీ చేసినట్టు చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా సర్జరీలు చేస్తున్నట్టు తెలిపారు. ఆస్పత్రిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత సేవలందిస్తున్నామని వెల్లడించారు.