Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో ఇంటి స్థలం, రూ కోటి నగదు బహుమతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగిలయ్యకు హైద్రాబాద్ నగరంలో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణ ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయల నగదు ప్రోత్సహకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల పద్మశ్రీ పురస్కారం పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు మొగిలయ్య శుక్రవారం ప్రగతిభవన్లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య ఎంతో అభినందనీయుడని తెలిపారు. ఆయనకు పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఆర్ధిక సాయానికి సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలంటూ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు. ఇప్పటికే మొగిలయ్య కళను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సీఎం తెలిపారు.