Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ అవినీతికి పాల్పడ్టారంటూ ఓ వైబ్ సైట్ పేర్కొన్న విషయాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ క్రమంలో రజత్‌కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. ఈమేరకు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. సాగునీటి శాఖను ప్రస్తుతం సీఎం హోదాలో కేసీఆర్ నిర్వహిస్తున్నారనీ, ఏఐఎస్ అధికారిపై వచ్చిన ఆరోపణలపై సీఎం కార్యాలయం కనీసం ఖండనగానీ, వివరణగానీ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. సీఎం పేషీలో పని చేసే అధికారిపై ఇంతటి తీవ్ర ఆరోపణలు వస్తే కేసీఆర్ తేలుకుట్టిన దొంగల్లా ఉండటం సరికాదని తెలిపారు. ఆయన కుమార్తె వివాహానికి సంబంధించి పలు హోటళ్లు, ప్యాలెస్‌లలో గదులు బుక్ చేయడానికి కంపెనీ ఉద్యోగులు మురళీ, ప్రమీలన్ ఫేక్ మొయిల్ ఐడీలు ఉపయోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలను ఓఎస్టీ ప్రభాకర్‌రావు సమన్వయం చేసినట్టు తెలుస్తున్నదని గుర్తు చేశారు. ఆ వెబ్సైట్ పొర్టల్ పేర్కొన్న ఆధారాలను పరిశీలిస్తే ఇది పూర్తిగా క్విడ్ ప్రోకో వ్యవహారంగా అనిపిస్తున్నదని అభిప్రాయపాడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం పేషీలోని సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్‌కుమార్, కంపెనీ మధ్య ఆర్థిక లావాదేవీలపై న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు.
నేటి టీచర్లకు ధర్నాకు సంపూర్ణ మద్దతు :రేవంత్
జీవో 317 రద్దు చేయాలంటూ శనివారం ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ధర్నాకు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లో డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు ధర్నాలో పాల్గొనాలని కోరారు. ప్రతి కార్యకర్త ధర్నాలో పాల్గొనడం ద్వారా ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి మద్దతు పలకాలని కోరారు.
కేంద్ర బడ్జెట్లో విద్య,వైద్య రంగాలకు తగిన నిధులు కేటాయించాలి తెలంగాణ పౌరస్పందన వేదిక
కేంద్ర బడ్జెట్ (2022-23)లో విద్యారంగానికి 10 శాతం, వైద్యరంగానికి 6శాతం నిధులు కేటాయించేలా కృషిచేయాలని తెలంగాణ పౌరస్పందన వేదిక పీసీసీ అధ్యక్షులు రేవంత్‌కు విజ్ఞప్తి చేసింది. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని రేవంత్ నివాసంలో వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎం రాధేశ్యాం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే విద్యా, వైద్య రంగాలకు చెందిన వివరాలను కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రికి లేఖ పంపించామని పేర్కొన్నారు.