Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ మౌనదీక్ష
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని నిరుద్యోగులు, రైతులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఇదే అంశాలపై ఆయన మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆరేండ్లలో పంట నష్టాన్ని చెల్లించారా? అని ప్రశ్నించారు. కౌలు రైతుల గురించి ఆలోచించారా? అని నిలదీశారు. రూ 550 మద్దతు ధరను రూ 1500 చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం కోదండరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇటీవల మంత్రులు పంట నష్టపోయిన రైతులు కాళ్లు పట్టుకున్నారనీ, అయినా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అప్పులు మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ మంత్రి సంభానీ చంద్రశేఖర్, శంబుల శ్రీకాంత్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.