Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏక సంఘంగా రిజిష్టరైన పది బీసీ కుల సంఘాలకు వచ్చేనెల రెండోతారీఖున బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ అనుమతి పత్రాలను అందజేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వెనుక బడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. గత డిసెంబర్లో అన్ని కులసంఘాలతో సమావేశం నిర్వహించి బీసీ కులాల్లోని సంఘాలన్నీ ఆత్మగౌరవ భవనం కోసం ఏక సంఘంగా ఏర్పడాలంటూ సూచించామని గుర్తుచేశారు.
ఆ రకంగా ఏర్పడిన ఏకసంఘానికి మాత్రమే ఆత్మగౌరవ భవనాల అనుమతులు ఇస్తామని తెలిపారు. ఎల్లాపి, మేదరి, పెరిక, నకాస్, బసవేశ్వర లింగాయత్, రంగ్రేజ్ భవసార, అగర్వాల్ సమాజ్, నీలి, జాండ్ర, తెలంగాణ మరాటమండల్లోని కుల సంఘాలన్నీ ఏక సంఘంగా ఏర్పడి ప్రభుత్వానికి తమ సమ్మతిని తెలియజేశాయనీ, వారందరికీ ఫిబ్రవరి రెండున మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోఅనుమతి పత్రాలు అందజేస్తామని తెలిపారు.