Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్కే సిన్హా కమిటీ నివేదికా అదే చెప్పింది
- చర్యలు తీసుకోండి : ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014లో ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరిగాయనీ, ఎస్కే సిన్హా కమిటీ తన నివేదికలో కూడా అదే చెప్పిందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలనీ, కబ్జాకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా సీఎస్‌కు ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరారు. శనివారం ఈ మేరకు ఒక లేఖ రాశారు. రెవెన్యూ అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా పట్టాలిప్పించి నో అబ్జెక్టివ్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారనే విషయం తేలిందని పేర్కొన్నారు. ఇందులో పాలుపంచుకున్న రెవెన్యూ ఉద్యోగుల్లో ఏ ఒక్కరిపైనా కూడా చర్యలు తీసుకోని విషయాన్ని గుర్తుచేశారు. రెవెన్యూ అధికారులు మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లేరులో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాల ద్వారా ఏడు కంపెనీలకు పట్టాలిచ్చారని తెలిపారు.