Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 244 శాతం ఆదాయం పెంపు
- 103 ఈవీ బస్సుల డెలివరీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతదేశపు అతి పెద్ద ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఒలెక్ట్రా) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31 నాటికి ముగిసిన మూడో త్రైమాసికంలో 244 శాతం వృద్ధిని సాధించింది. రికార్డు స్థాయిలో రూ.207.1 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో ఆ సంస్థకొచ్చిన ఆదాయం రూ.60.1 కోట్లు మాత్రమే. ఇందులో అత్యధిక ఆదాయం ఎలక్ట్రిక్ బస్సుల నుంచే కావడం గమనార్హం. ఆ సంస్థ ఈ -బస్ విభాగం నుంచే రూ.186 కోట్లు వచ్చాయి. ఈ విభాగానికి 2020-21 ఇదే త్రైమాసికంలో రూ.28.7 కోట్లు మాత్రమే వచ్చాయి. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 13బస్సులను సరఫరా చేయగా,ఈ ఏడాదికి అదే సమయంలో 103బస్సులను డెలివరీ చేసింది. ఇన్సులేట ర్ విభాగానికి ఆదాయం కూడా రూ.21.1 కోట్లు వచ్చా యి.ఈబీఐటీడీఏ,రాబడి రూ.6.7కోట్ల నుంచి రూ.27 కోట్లకు ఎగబాకింది.ఈ-బస్ డివిజన్ ఇప్పటికే 1,523 ఎలక్ట్రిక్ బస్సుల బుకింగ్ ను పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఆ సంస్థ ఒజీఎల్ సీఎండీ కె.వి.ప్రదీప్ మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్ తగినట్టు డెలివరీలు చేస్తామన్నఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోను ఈవీ తయారీ ప్లాంటు ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.