Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.లక్షలోపు రైతురుణమాఫీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. సుమారు రూ.25 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా, గడిచిన మూడేండ్లలో రూ.735 కోట్లు మాత్రమే మాఫీ చేశారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో యాసంగి పంటకు 30 శాతం మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయని పేర్కొన్నారు. మిగిలిన 70 శాతం మంది రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని వివరించారు. వడగండ్ల వాన, మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతుకు ఇప్పుడు సకాలంలో రుణాలు అందక అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీని పూర్తి చేసి యాసంగి పంటకు కావాల్సిన రుణాలను బ్యాంకుల నుంచి ఇప్పించాలని కోరారు.