Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలి
- ఆర్‌యూపీపీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖలో వినేవారు కరువయ్యారనీ, దీంతో ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో ఉపాధ్యాయులున్నారని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్‌యూపీపీ) అధ్యక్షులు సి జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 317 జీవో ద్వారా వివిధ జిల్లాలకు ఉపాధ్యాయులకు సర్దుబాటు చేసే ప్రక్రియలో జరిగిన తప్పిదాలను సవరించాలంటూ వేలకొద్ది అప్పీళ్లను పరిష్కరించే వారే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ సంచాలకులు,జేడీ ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కార్యదర్శి వద్ద ఉందంటూ దాటవేస్తున్నారని విమర్శించారు. కానీ సమస్యల పరిష్కారం ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని విమర్శించారు. సీనియార్టీలో, పుట్టినతేదీ, చేరిన తేదీ, మార్కుల మెమో వంటి అనేక తప్పులు జరిగాయనీ, అధికారులూ తప్పులు చేశారని తెలిపారు. భార్యాభర్తలను 19 జిల్లాలకే సర్దుబాటు చేశారని పేర్కొన్నారు.13జిల్లాల్లోనూ వారిని అనుమతిం చాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రేడ్-2 హిందీ పండిట్ల జాబితా తయారీలో జరిగిన తప్పుల వల్ల సీనియర్లు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టింగ్‌ల కోసం 42 మంది హిందీ పండితులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.