Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాంతి, సహనాలను ప్రదర్శిస్తూ ఎన్ని కష్టాలెదురైనా, ప్రజాస్వామిక పద్దతుల్లో ఉన్నతమైన లక్ష్యాలను సాధించిన జాతిపిత మహాత్మా గాంధీ కార్యాచరణ ఆదర్శనీయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళి అర్పించారు. సత్యం, అహింసా మార్గాలే ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్ముడి స్పూర్తి గొప్పదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధించడంలో గాంధీజీ అనుసరించిన శాంతియుత విధానాలు ఇమిడి వున్నాయని సీఎం తెలిపారు. గాంధీజీ అనుసరించిన శాంతి, సౌభ్రాతృత్వం, లౌకిక విధానాన్ని అవలంబిస్తూ నూతన తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతున్నదని సీఎం అన్నారు.