Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే రెండ్రోజులు రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వర్లీ(టి)లో అత్యల్పంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత సిర్పూర్(కొమ్రంభీమ్ అసిఫాబాద్)5.8, గిన్నెదారి(కొమ్రభీమ్) 6.0, మీర్ఖాన్పేట(రంగారెడ్డి)6.2, న్యాకల్(సంగారెడ్డి) 6.2, జైనధ్(ఆదిలాబాద్)6.3, పిప్పల్దరి(ఆదిలాబాద్)6.3, పెంబి(నిర్మల్)6.6, ఆదిలాబాద్ అర్బన్ 6.6 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్దయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీల లోపే నమోదయ్యాయి.