Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాబ్‌చార్టు విడుదల చేయాలి
- వీఆర్వో వ్యవస్థ రద్దుతో ఇబ్బందుల్లో ప్రజలు : వీఆర్వోల సంక్షేమ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూపరిపాలన శాఖను బలోపేతం చేయాలనీ, వీఆర్వోలను ఆ శాఖలోనే కొనసాగించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి హరాలే సుధాకర్‌రావు, కోశాధికారి కోనబోయిన ప్రసాద్, ఉపాధ్యక్షులు మోహన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దయి ఏడాది దాటినా వీఆర్వోల జాబ్ చార్ట్ ను ఖరారు చేయకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వోలు ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, సామాజిక భద్రత, ఆర్థిక హక్కులను కోల్పోయి నిస్సాహాయస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. రాత్రీపగలు తేడా లేకుండా భూరికార్డులను క్లియర్ చేశామనీ, తమ శ్రమ ఫలితంగానే ఇప్పుడు రైతులు రైతుబంధు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. వీఆర్వోలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు.