Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రజక వత్తిదారుల సమాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బడుగు బలహీన వర్గాల ఆహార స్వేచ్ఛను వ్యతిరేకించడం అంటే బానిసత్వాన్ని శాశ్వతం చేయడమేనని తెలంగాణ రజక వత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చినజీయర్ మత ఛాందసత్వంతో అహంకారపూరితంగా తన ప్రవచనాలలో కులాల నిర్మూలన తగదని, ఏ కులం వారు ఆ కులం పనేచేయాలనీ, మాంసాహారులు ఏ మాంసం తింటారో ఆ జంతువుల మాదిరిగానే ప్రవర్తిస్తారని చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. కులం, అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన వారిలో రామానుజచార్యులు. కబీర్ వంటి గొప్ప ఆధ్యాత్మిక గురువులు ఉన్నారన్న విషయాన్నీ చిన జీయర్ గుర్తుచేసుకోవాలని పేర్కొన్నారు. లౌకిక దేశంలో ఆహారపు అలవాట్లపై ఆంక్షలు విధించడం తగదని తెలిపారు. అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. మెజారిటీ మాంసాహార ప్రజలైన దళిత, గిరిజన, బహుజన ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు. వారి ఆహారపు అలవాట్లను, జీవనశైలిని కించపరుస్తూ తమ తోటి మతస్థులకు వ్యతిరేకంగా అమానవీయంగా ప్రసంగించటం తగదని పేర్కొన్నారు.