Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 గొర్రెలు, ఆవు మృత్యువాత
నవతెలంగాణ - అచ్చంపేట
అర్ధరాత్రి గొర్రెల మందపై పెద్దపులి దాడి చేసింది. దాంతో 12 గొర్రెలు, ఆవు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలోని నల్లమల అభయారణ్య ప్రాంతాలైన లింగాల, అమ్రాబాద్ మండలాల్లోని అటవీ సమీప గ్రామాలైన ఎంసీ తండా, బీకే తిరుమలాపురం గ్రామాల్లో శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంసీ తండాకు చెందిన పాత్లావత్ పుల్యా మేకలు, గొర్రెల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో 4 మేకలు అక్కడికక్కడే మృత్యువాత పడగా..మరో12 జీవాలు కన్పించలే దు.గ్రామస్తులు, అటవీ సిబ్బంది సహకారంతో అటవీ ప్రాంతంలో వెతకగా గుడ్ల చెరువు సమీపంలో జీవాలు చనిపోయి ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.2లక్షలు ఉంటుందని బాధిరాలు వాపోయారు. తమను ఆదుకోవాలని కోరారు. అలాగే, నాలుగు రోజుల కిందట అమ్రాబాద్ మండలంలోని బీకే తిరుమలాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. శనివారం అటవీ సిబ్బంది సాయంతో వెతకగా కళేబరం కనిపించింది. మృత్యువాత పడిన జీవాలను అటవీ సిబ్బంది అక్కడే ఖననం చేశారు. పెద్ద పులుల సంచార ంతో అటవీ సమీప గ్రామాలైన ఎంసీ తండా, బీసీ తండా, ఎర్రపెంట, అప్పాయిపల్లి గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.