Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకులకు మంత్రి కేటీఆర్ సవాల్
- మున్సిపాలిటీల్లో రూ.371.9 కోట్ల పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ- మహేశ్వరం
రాష్ట్ర ప్రజలపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నాయకులు అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలు, బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లు, మహేశ్వరం మండల కేంద్రంలో రూ.371.9కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. మహేశ్వరంలో తాగునీటి పథకాలకు, రహదారుల విస్తరణ, వరద నీటి కాలువలు, నాలాలు, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బడంగ్పేట్లో పట్టణ ప్రాథమిక కేంద్ర భవనాన్ని మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా లాంటి సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలు సైతం కాపీ కొట్టి అమలు చేస్తుంటే బీజేపీ నేతలకు మాత్రం అదేమీపట్టనట్టు పసలేని, పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప మంత్రుల కాన్వారు ముందు పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఎగ్గే మల్లేశ్ యాదవ్, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, జలమండలి ఎండీ దాన కిషోర్, మున్సిపల్ సీడీఎంఏ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు.