Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైసీపీటీపీ నేత గట్టు రామచంద్రరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుబీమా ఒప్పందంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని వైసీపీటీపీ నేత గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఎల్ఐసీతో సీఎం కేసీఆర్ చేసుకున్న ఒప్పందం ప్రకారమే రైతులు ఉన్నారా? 59 ఏండ్లు దాటిన రైతులు లేరా? అని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాయంలో వయసు తక్కువగా నిర్ణయించడంతో 24లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. ఆర్టికల్ 14 ప్రకారం పథకాల్లో ఎలాంటి పక్షపాతం ఉండకూడదన్న నిబంధన ఉందన్నారు. రైతులందరికీ రైతుభీమా అందజేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ సంస్థలో రైతులకు వయస్సు పరిమితితో సంబంధం లేకుండా అందరికీ వర్తించేలా పాలసీలు తీసుకురావాలని కోరారు.