Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలోని గాంధీవిగ్రహం వద్ద శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ సిద్ధాంతాలు, స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిగా నిలుస్తాయని పోచారం చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మెన్ హసన్ జాఫ్రి, శాసన వ్యవహారాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ ఎమ్ఎస్ ప్రభాకర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల నివాళి
గాంధీభవన్ ఆవరణలో గాంధీ విగ్రహనికి టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ సేవలను కొనియాడారు. దేశం స్వాతంత్య్రం కోసం జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మహేశ్‌కుమార్‌గౌడ్, జి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.