Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయ అభివద్ధికి అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ రూ. కోటి 16 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ నిధుల్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయాలని కోరింది. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవివర్మ ఆదివారం ప్రగతిభవన్లో మంత్రి కే తారకరామారావును కలిసి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన్ని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేశ్ బిగాల తదితరులు పాల్గొన్నారు.