Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం డైరీ, క్యాలెండర్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అందరికీ ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులకు ఉపయుక్తంగా డైరీని రూపొందించినందుకుగానూ ప్రధానోపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మంత్రి దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. కొంత మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల మల్టీజోన్ అలొకేషన్ ప్రక్రియ పూర్తి కాలేదనీ, దాన్ని పరిష్కరించాలని మంత్రిని కోరారు. 40 పాఠశాలలకు సంబంధించి ఆంగ్ల మాధ్యమంలో అదనపు తరగతులకు అవకాశమిస్తూ ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. రెండు సమస్యలపైనా ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రాజభాను చంద్రప్రకాశ్, ప్రధానకార్యదర్శి ఆర్.రాజగంగారెడ్డి, కోశాధికారి బి.తుకారం, వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.