Authorization
Tue April 08, 2025 02:05:35 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబింపజేసేలా తెలంగాణ పట్టణప్రాంతాల అభివృద్ధి వేదిక(పట్నం) క్యాలెండర్ ఉందని ఆ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లో 'పట్నం' క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..సంస్కృతి, మానవాళి మనుగడకు ముఖ్యమైన ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని నొక్కిచెప్పారు. ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీఎస్ఎం రాజు, హైదరాబాద్ నగరకార్యదర్శి ఎం.మారన్న, నగర నాయకులు పి.మల్లేశ్, సి.మల్లయ్య, ఆశోక్, ప్రజానాట్యమండలి నగర కార్యదర్శి మహారాజు పాల్గొన్నారు.