Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ కేటాయింపులపై ప్రధానికి మంత్రి కేటీఆర్ ట్వీట్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామనీ, ప్రతి భారతీయు డికి సొంతిల్లు, మంచినీరు, విద్యుత్, టాయిలెట్ సదుపాయం కల్పిస్తామని గతంలో మీరిచ్చిన హమీలను ఓసారి గుర్తుచేస్తున్నా... అంటూమంత్రి కే తారకరామారావు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. దానితో పాటే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు కేటాయింపులను ప్రస్తావించారు. ఈ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు సమానంగా ఉంటాయనీ, వాస్తవికతను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. నీతి ఆయోగ్ చెప్పినట్టు మిషన్ కాకతీయ, భగీరథకు నిధులు ఇవ్వాలని కోరారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లాంటి అభివద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మద్దతు ఇవ్వాలనీ, కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేరేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నామనీ ట్వీట్ చేశారు.