Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తాము ప్రాతనిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జరుగుతున్న ముఖ్యమైన ప్రజా పనులకు సంబంధించి చెప్పుకునేందుకు సమయం కేటాయించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ను కోరారు. ఈ మేరకు సోమవారం భట్టి వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫిబ్రవరి మొదటి వారంలో ఒకటి నుంచి ఏడో తేదీల మధ్య సీఎంకు అనుకూలమైన తేదీ, సమయంలో ఆపాయింట్ మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.