Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా అంకుర సంస్థల స్థాపనకు తెలంగాణ ఎఐమిషన్ రెండో దఫా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది ఆగస్టులో ఈ కార్యక్రమం కింద 42 అంకుర సంస్థలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీటి ద్వారా ప్రభుత్వ, పరిశ్రమల భాగస్వామ్యంతో అంకుర సంస్థలు సామాజిక, వ్యాపార సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్రను పోషించాయి. మొదటి దఫా అనుమతి పొందిన అంకుర సంస్థల్లో 20 సంస్థలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నార్త్ అమెరికన్ మార్కెట్లో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, టీ ఎయిమ్ కృత్రిమ మేధస్సు రంగానికి అనువైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.