Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు కేంద్రం ప్రశంస
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లేఖ రాసింది. ఈ లేఖపై రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. పారదర్శకత, జవాబు దారీతనంలో సీఎం కేసీఆర్ అందరికీ ఆదర్శమని హరీశ్‌రావు కొనియా డారు. ఆన్లైన్ ఆడిటింగ్‌లో రాష్ట్రానికి మరోమారు కేంద్రం నుంచి ప్రశంస లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులకు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.