Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లపై రవాణామంత్రి సమీక్ష
- కిన్నెర మొగులయ్యకు సన్మానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మేడారం జాతర ప్రయాణీకుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ 3,845 బస్సుల్ని నడుపుతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ ఇప్పటికే పూర్తిచేశామన్నారు. సోమవారం బస్‌భవన్‌లో ఆయన టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఇతర ఉన్నతాధికారులతో మేడారంకు బస్సుల ఏర్పాట్లను సమీక్షించారు. జాతర ప్రాంగణంలో బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లను 42 క్యూలైన్లను 50 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, ఖమ్మం, మెదక్, తదితర జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల ద్వారా ఫిబ్రవరి 13 నుంచి 20వ తేదీ వరకు బస్సుల రాకపోకలు కొనసాగుతాయని తెలిపారు. జాతర బస్సుల్లో విధులు నిర్వహించే సిబ్బందికి మంచి ఆహారం అందించడంతో పాటు మెరుగైన వసతి సదుపాయాలు ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ అధికారులకు సూచించారు . కోవిడ్, ఒమిక్రాన్‌ల నుంచి రక్షించుకునేందుకు సిబ్బందికి స్పెషల్ డ్రైవ్ ద్వారా బూస్టర్ డోస్‌లను ఇప్పించాలని, హ్యాండ్ శానిటైజర్స్, మాస్కులను కూడా అందివ్వాలని ఆదేశించారు. డిపో నుంచి బయలుదేరే సమయంలో బస్సును పూర్తిగా శానిటైజేషన్ చేయాలని చెప్పారు . జాతర ప్రాశస్త్యం దృష్ట్యా లాభనష్టాలను భేరీజు వేసుకోకుండా మెరుగైన రవాణా సేవల్ని అందించాలన్నారు. టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ జాంలను నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ జాతర బస్సు సర్వీసుల నిర్వహణ కోసం 12 వేల మంది సిబ్బంది , 150 మంది అధికారులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. జాతర సమయంలో ప్రత్యేకంగా 50 సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తూ, బస్సుల రాకపోకల వివరాలు తెలిపేందుకు బస్టాండులలో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆన్లైన్ ద్వారా ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవచ్చని వివరించారు.
కిన్నెర మొగులయ్యకు సన్మానం
కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగు లయ్యను రవాణామంత్రి సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి, పూలమాల వేసి అభినందించారు. సామాన్య కుటుంబం నుంచి జీవన ప్రస్థానం ప్రారంభించి అసమాన స్థాయిలో పద్మశ్రీ అవార్డును కైవసం చేసుకున్నారని కొనియాడారు.దీనిపై మొగులయ్య స్పందిస్తూ సీఎం కేసీఆర్ తన కళను వెలుగులోకి తెచ్చారనీ, ప్రభుత్వ సహాయ సహకా రాలు మరిచిపోలేనన్నారు. అలాగే తన ఆర్థిక స్థితి చూసి చలిం చి ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ ఉచిత బస్సు పాస్ ఇవ్వడాన్ని ఆయన గు ర్తు చేసుకున్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురు షోత్తం, వినోద్, యాదగిరి, వెంకటేశ్వర్లు, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.