Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ సంస్కృతి ని తన కెమెరాలో బంధించి, మహోన్నతుల చిత్రాలను తన కుంచెతో సజీవ మూర్తులుగా నిలిపిన ప్రముఖ ఛాయాచిత్రకారుడు భరత్ భూషణ్(67) ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన కొన్ని వందల అపురూప ఛాయాచిత్రాలను సమాజానికి అందించారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ అంబర్పేట్ శ్మశాన వాటికలో నిర్వహించారు. గుడిమల్ల భరత్ భూషణ్ మృతి పట్ల సీఎం కేసీఆర్, మంత్రులు కె.తారక రామారావు, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సంతాపం ప్రకటించారు.
చిత్రకారుడు, జర్నలిస్టు
భరత్‌భూషణ్ మతికి ఫెడరేషన్ సంతాపం
బతుకమ్మ, తెలంగాణ పల్లె థీమ్‌గా ఫోటోగ్రఫీని సృష్టించిన భరత్‌భూషణ్‌ని కోల్పోవడం మీడియా, ఫోటో రంగానికి తీరనిలోటని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య తెలిపారు. అత్యున్నత పోటోలు తీసి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. భరత్‌భూషణ్ నాలుగు దశాబ్దాలపాటు చిత్రకారుడిగా కొనసాగి, అనారోగ్యానికి గురైనా చివరి వరకూ మేటిగా నిలిచారని గుర్తు చేశారు. భరత్‌భూషణ్ మృతికి సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈమేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.