Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధించడంలో మండల పరిషన్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీఓ) పాత్ర కీలకమైనదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. సోమవారం హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోగల మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మండలపరిషత్ అభివృద్ధి అధికారుల 2022 డైరీ, క్యాలెండర్‌ను ఎర్రబెల్లి ఆవిష్కరించారు.
పంచాయతీరాజ్‌లో ఎన్నో ఏండ్లు ఉన్న ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించి అర్హులైన అందరికీ ప్రమోషన్లు ఇచ్చారన్నారు. గ్రామాల అభివృద్ధికి మూడేండ్లలో రూ.7,203 కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేశామనీ, వివిధ శాఖల ద్వారా మరో రూ.8,867 కోట్ల విలువైన పనులు చేపట్టామని తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..గ్రామాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయవంతంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.రాఘవేంద్రరావు, ఎంపీడీఓల అసోసియేషన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సత్తయ్య, ప్రధాన కార్యదర్శి జి చంద్రశేఖర్, టీజీఓ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, ఎంపీడీవోల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, పబ్లిసిటీ సెక్రెటరీ నాగేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.