Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడుల ప్రారంభంపై మంత్రికి ట్రస్మా కృతజ్ఞతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థల్లోనూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మంగళవారం నుంచి బడులను ప్రారంభించడంపై సోమవారం హైదరాబాద్‌లో మంత్రి సబితను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎస్ మధుసూదన్ నేతృత్వంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బడుల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. శానిటైజేషన్ చేపట్టాలనీ, భౌతిక దూరం పాటించాలనీ, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కరోనా నుంచి స్వీయరక్షణ చర్యలు పాటించాలని సూచించారు. విద్యార్థులకు జరుగుతున్న విద్యానష్టాన్ని పూరించేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో రీడింగ్, రైటింగ్ అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి సిలబస్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను సిద్ధం చేయాలని కోరారు. ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సిలబస్ పూర్తికానందున ఈ విద్యాసంవత్సరాన్ని మే నెలాఖరువరకు పొడిగించాలని కోరారు. పదో తరగతి పరీక్ష ఫీజు వివరాలు వచ్చినందున ఈటీఆర్లు పెండింగ్‌లో ఉన్న పాఠశాలల ఫైల్‌ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా నాయకులు ఉమామహేశ్వరరావు, శివరాత్రి యాదగిరి, కృష్ణప్రసాద్, రఘు, పవన్, అల్తాఫ్ హుస్సేన్, సోమేశేఖర్, శివరామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.