Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈఆర్సీ వద్ద కాంగ్రెస్ పిటిషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేదలపై విద్యుత్ భారం వేయొద్దని టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సంస్థలు 2022-23 సంవత్సరానికి విద్యుత్ సంస్థలు పంపిన 55.20 పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలతో నెలకు 50 యూనిట్లలోపు ఉపయోగించే వినియోగదారులపైనే భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 51-100 యూనిట్లు వాడే వినియోగదారులపై 39.50 శాతం భారం పడుతుండగా, 800 యూనిట్లకు పైగా వాడే వినియోగదారులకు అది 8.9 శాతం భారం పడుతుందని చెప్పారు. దీంతో రూ. 72.50 ఛార్జీలు చెల్లిస్తున్న పేదలు ఏప్రిల్ నుంచి రూ.112.50 చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందనీ, ఇల్లు ఖాళీగా ఉంటే ఇప్పుడు నెలకు 55 రూపాయలను కనీస చార్జీ ఉందనీ, వచ్చే నెల నుంచి 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం పేదలను లక్ష్యంగా చేసుకున్న ప్రతిపాదనలేనని స్పష్టం చేశారు. జెన్కో సంస్థలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.