Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. సోమవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్ద దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంటూ హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ హామిని నెరవేర్చలేదని తెలిపారు. ఉద్యోగాలిచ్చేంత వరకు పోరాడుతామని హెచ్చరించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఇచ్చిన హామీ రూ.3 వేల నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు గల్లిలో కొట్లాట... ఢిల్లీలో దోస్తానా చేస్తున్నాయని విమర్శించారు. మిలియన్ మార్చ్ చేస్తామంటున్న బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ ఎంపీల దగ్గరే మార్చ్ చేయాలని సవాల్ చేశారు.