Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తన అద్భుతమైన ఛాయాచిత్రాల ద్వారా అపురూపమైన తెలంగాణ వారసత్వం, గ్రామీణ జీవనశైలి, సంస్కతిని ప్రపంచం దష్టికి తీసుకెళ్లిన గొప్ప ఫోటోజర్నలిస్టు జీ భరత్ భూషణ్ అని తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి ఒక ప్రకటనలో కొనియాడారు. అయన ఆకస్మిక మరణం ఫోటోగ్రఫీ ప్రపంచానికి తీరని లోటు అన్నారు. ఫోటోగ్రఫీ అనేది హదయంతో మాట్లాడే విశ్వవ్యాప్త భాష అని భరత్ భూషణ్ దడంగా నమ్మేవారనీ, వత్తిపరమైన ఫోటో జర్నలిజాన్ని పోషించడం, ప్రోత్సహించడం, సహకరించడంతోపాటు ప్రశంసించేవారని గుర్తుచేశారు. స్పష్టమైన దష్టి, సజనాత్మక సమన్వయం, పాత్రికేయ నైపుణ్యం కలిగిన అతని అత్యంత ఆకర్షణీయమైన దశ్య కథనాలు భవిష్యత్ తరాలకు చరిత్రలో సజీవంగా ఉంటాయన్నారు. ఈ సందర్బంగా భరత్ భూషణ్ కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్, కోశాధికారి కె. అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు జి. వసంత్ కుమార్ తదితరులు హైదరాబాద్ శంకర్ మఠం పద్మ కాలనిలోని భరత్ భూషణ్ నివాసానికి వెళ్లిభౌతికకాయం పై ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.