Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివేదికను సుప్రీంకు సమర్పించిన కమిషన్
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ లైంగికదాడి , దారుణ హత్య కేసులో జరిగిన నలుగురి ఎన్కౌంటర్ కేసు ఘటనపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ తన విచారణను పూర్తి చేసింది. ఈ విచారణకు సంబంధింవచిన నివేదికను రెండు రోజుల కిందట సుప్రీంకోర్టుకు కమిషన్ సమర్పించింది. మూడేండ్ల కిందట.. 2019 లో శంషాబాద్ సమీపంలో దిశ పై సామూహిక లైంగికదాడి, దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో అరెస్టయిన నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జోల్లు నవీన్లు షాద్నగర్ సమీపంలో 2019 డిసెంబర్ 6వ తేదీన ఎన్కౌంటర్కు గురయ్యారు. జరిగిన ఎన్కౌంటర్పై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో సుప్రీంకోర్టు జొక్యం చేసుకుని ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు జడ్జీ శివపూర్కర్ నేతృత్వంలో జస్టిస్ ఎంఎస్ సొందుర్ బాల్దోత, సీబీఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ కార్తికేయ సభ్యులుగా కమిషన్ను ఏర్పాటు చేసింది. దీంతో రంగంలోకి దిగిన కమిషన్ 47 రోజుల పాటు 57 మంది సాక్షులను విచారించింది. ఇందులో ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులు, వారికి నేతృత్వం వహించిన అధికారులతో పాటు పలువురు ఈ ఎన్కౌంటర్పై ఆసక్తి కలిగిన వారిని కూడా కమిషన్ విచారించింది. అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా కమిషన్ సందర్శించింది. అనంతరం తన విచారణను పూర్తి చేసిన కమిషన్ ఈనెల 28న సుప్రీంకోర్టుకు తన నివేదికను అందచేసింది.
2785 మంది పిల్లలను రక్షించిన ఆపరేషన్ స్మయిల్
ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సాగిన ఆపరేషన్ స్మయిల్లో మొత్తం 2785 మంది అనాధ, వీధి బాలలను రక్షించినట్టు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా సోమవారం తెలిపారు. ముఖ్యంగా ఆపరేషన్ స్మయిల్, ముస్కాన్లను అనాధ పిల్లలు, ఇటుక బట్టీలలో పనిచేసే కార్కికులు , హెల్పర్లు, రేల్వే స్టేషన్లలో బాలకార్మీకులుగా పనిచేసే వారిని తిరిగి వారి సొంత గూళ్లకు చేర్చడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. ప్రతి ఏడాది జనవరి లో నెల రోజుల పాటు ఆపరేషన్ స్మయిల్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో ఫెషియల్ రికాగ్నైజేషన్, తో పాటు దర్పణ్ యాప్లను వాటం ద్వారా పప్పిపోయిన పిల్లలను వారి సొంత తల్లి దండ్రులను గుర్తించి అప్పగించడానికి వీలవుతున్నదని ఆమె తెలిపారు. ఈ మారు రక్షించిన వారిలో 2296 మంది బాలలు, 489 మంది బాలికలు ఉన్నారని చెప్పారు.