Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌలు రైతు ఆత్మహత్య
- నల్లగొండ జిల్లాలో విషాదం
నవతెలంగాణ -నార్కట్ పల్లి
వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మూడ్రో జుల కిందట పురుగుల మందు తాగిన కౌలు రైతు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మల గూడెంలో జరిగింది. ఎస్ఐ బొడిగె రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతుమ్మలగూడెం గ్రామానికి చెందిన బాత్క రామలింగయ్య (40) నాలుగెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. పెట్టు బడుల కోసం సుమారుగా ఐదు లక్షల రూపాయలు అప్పు తెచ్చాడు. వ్యవసాయం లో నష్టం రావడంతో అప్పు ఎలా తీర్చాలోనని ఆందోళనకు గురయ్యాడు. జనవరి 29వ తేదీన గ్రామంలోని బిమిడి జయలక్ష్మమ్మ వ్యవసా య భూమి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని కామినేని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యంకోసం ఉస్మానియాఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందాడు. రైతు భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.