Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ డిమాండ్
- తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ- బోడుప్పల్/విలేకరులు
రాష్ట్రంలోని నిరుద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) నాయకులు డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొలువులు లేక జీవన పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక, ఉపాధిమార్గం లేక ఆత్మ హత్య చేసుకుంటున్న పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డీవై ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
నిరుద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే డీవై ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశ్ డిమాండ్ చేశారు. మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు కావా లని ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాలు రాక, ఉపాది కరువై యువత నేడు ఆవేదనకు గురవు తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1,91,126 ఉద్యో గాలు ఖాళీగా ఉన్నాయని, ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రకటించలేదని, కేసీఆర్ సర్కారు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోం దని అన్నారు. ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాల న్నారు. అదే విధంగా 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి రూ.3016 ఇవ్వాలన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని చెప్పారు. ఉద్యోగాలు రాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న యువతీయువకుల కుటుంబాలను సర్కారు అనుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మేడిపల్లి తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఇప్పకైనా ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముశ్యం కిరణ్, నాయకులు మాదం కిరణ్ కుమార్, నవీన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ డిప్యూటీ తహసీల్దార్‌కు కూడా వినతిపత్రం అందజేశారు.
కుత్బుల్లాపూర్ ఇన్చార్జి తహసీల్దార్ వినరు కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, 317 జీవోను రద్దు చేయాలని, జీడిమెట్ల పారిశ్రామిక ాడలో యువతకు 50 శాతం ఉద్యోగాలు కల్పిం చాలని డిమాండ్ చేశారు. కాప్రా ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. డీవైఎఫ్ఐ బాలానగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.