Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదుట సీనియర్ సిటిజన్ల ఆందోళన
- రైల్వే శాఖ స్పందించాలని డిమాండ్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
వికలాంగులు, పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ రైళ్లలో ప్రయాణించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీని పునరుద్ధరించాలని తెలంగాణ పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్, వికలాంగులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సోమయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లాట్‌ఫారమ్ టికెట్ ధర తగ్గించాలన్నారు. ప్రత్యేక రైళ్లలో కూడా రాయితీలు అమలు చేయాలన్నారు. ఈ సమస్యలపై రైల్వే శాఖ అధికారులు దృష్టి సారించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ కోరారు. ఈ ఆందోళనలో అసోసియేషన్ నాయకులు గోపాల్‌రెడ్డి, పాండురంగారెడ్డి, ప్రభాకర్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.