Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణం వేతన సవరణ చేయాలి
- చైర్మెన్, ఎమ్డీలకు టీఎస్ఆర్టీసీ జేఏసీ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని పది కార్మిక సంఘాలతో కూడిన టీఎస్ఆర్టీసీ జేఏసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు వినతి పత్రాలు సమర్పించారు. జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి (ఎంప్లాయీస్ యూనియన్), వైస్ చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్ (టీజేఎమ్‌యూ), కన్వీనర్లు వీఎస్ రావు (టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్-ఎస్‌డబ్ల్యూఎఫ్), పి కమాల్‌రెడ్డి (ఎన్‌ఎమ్‌యూ), కో కన్వీనర్లు పి రమేష్‌కుమార్ (కార్మిక సంఘ్), జీ అబ్రహం (ఎస్‌డబ్ల్యూయూ), కే యాదయ్య (బీకేయూ), బీ సురేష్ (బీడబ్ల్యూయపి హరికిషన్ (ఎస్‌టీఎమ్‌యూ), బీ యాదగిరి (కార్మిక పరిషత్) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలపై యాజమాన్యానికి వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. టిక్కెట్ తీసుకొనే బాధ్యత ప్రయాణీకుడిదేననీ, దాన్ని అమలు చేస్తూ సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులేషన్స్ మార్పు చేయాలని కోరారు. 2019 నుంచి రావల్సిన ఆరు డీఏలు బకాయిలతో చెల్లించాలనీ, 2019 సమ్మెకు ముందున్న పరిస్థితుల్ని కల్పిస్తూ రిజిస్టర్ ట్రేడ్ యూనియన్ల హక్కుల్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ కార్మికులకు సెటిల్మెంట్లు చెల్లించాలనీ, సకలజనుల సమ్మె కాలం వేతనం ఇవ్వాలనీ, కార్మికులపై వేధింపులు ఆపాలనీ, బడ్జెట్లో ఆర్టీసీకి 2 శాతం గ్రాంటును ఇవ్వాలనీ, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. మోటారు వాహన సవరణ చట్టం-2019 బిల్లును, లేబర్కోడ్లనూ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చి, ఆర్టీసీ కార్మికులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి, కరోనాతో చనిపోయిన వారికి రూ.50 లక్షల బీమా చెల్లించాలని కోరారు. 2013 వేతన సవరణనాటి 50 శాతం బాండ్ల డబ్బులు చెల్లించాలనీ, ఎస్ఆర్బీఎస్, ఎస్‌బీటీలకు చెల్లింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలనీ, అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇవ్వాలనీ, కార్మికులు డ్యూటీకి రిపోర్టు చేస్తే హాజరు ఇవ్వాలనీ, ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వ ఈక్విటీగా మార్చాలనీ, డీజిల్‌పై పెంచిన ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంస్థలో మహిళలపై వేధింపులు ఆపాలనీ, లైంగిక వేధింపుల కమిటీని పునరుద్ధరించాలనీ, విధి నిర్వహణలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షలు ఇవ్వాలని కోరారు.