Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన
- ముగిసిన సంక్రాంతి సెలవులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మంగళవారం నుంచి బడిగంట మోగనుంది. కేజీ నుంచి పీజీ విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతనెల ఎనిమిది నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. కానీ కరోనా కేసులు క్రమంగా పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ సిఫారసు మేరకు ఈనెల 31 వరకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది. సోమవారంతో సంక్రాంతి సెలవులు ముగిశాయి. 24 రోజుల తర్వాత విద్యాసంస్థలు పున:ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వ పాఠ శాలలు, కాలేజీలకుఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇప్పటికే హాజరవుతు న్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతి గదులు సిద్ధమవుతున్నా యి. ఇక ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు తరగతులకు హాజర య్యేందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలంటూ ఇప్పటికే విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. అయితే ఎనిమిది, తొమ్మిది, పదో తరగతితోపాటు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు టీశాట్ ద్వారా టీవీ పాఠాలు ప్రసారమవుతున్నాయి. మంగళవారం ప్రత్యక్ష బోధనతోపాటు టీవీ పాఠాలు కొనసాగుతాయా?లేదా?అనే దానిపై విద్యాశాఖ అధికారుల నుంచి స్పష్టత కొరవడింది.