Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్మెంట్కు విద్యార్థులు 2021-22 విద్యాసంవత్సరంలో దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడిప్పుడే అన్ని రకాల ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తి చేసుకుని విద్యార్థులు విశ్వవిద్యాలయాఉల, కాలేజీల్లో ప్రవేశం పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేశారని వివరించారు. ఇంకా మూడున్నర లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. వారికోసం తక్షణమే దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని సూచించారు.