Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ అజరుకుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ చెప్పారు. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారనీ, దానికి అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇచ్చినట్టు తెలిపారు. సోమవారంనాడాయన గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.పరిశ్రమలో స్లాబు విధానాన్ని,40 శాతం రాయల్టీ రాయితీని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే వాటికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. కోవిడ్‌తో గ్రానైట్ పరిశ్రమ దెబ్బతిన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిందని వివరిం చారు.ఈ నిర్ణయం పట్ల ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరా బాద్ జిల్లాల గ్రానైట్ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.